‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ రివ్యూ

- November 04, 2022 , by Maagulf
‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ రివ్యూ

నటీనటులు: అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిషోర్; పృధ్వీ, ఆమని, కేదార్ శంకర్, పోసాని కృష్ణ మురళి తదితరులు.

సంగీతం: అచ్చు, అనూప్
సినిమాటోగ్రఫీ: తన్వీర్,
కూర్పు: కార్తిక శ్రీనివాస్,
నిర్మాణ సంస్థ: జిఏ2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్,
సమర్పణ: అల్లు అరవింద్,
దర్శకుడు: రాకేష్ శశి.

అల్లు శిరీష్, అనూ ఇమ్యాన్యుయేల్ జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకి అల్లు అరవింద్ సమర్పకులు కావడంతో, సినిమాని బాగా ప్రమోట్ చేశారు. ప్రచార చిత్రాలతోనే సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఈ రోజు బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేమీ లేకపోవడం, విడుదలైన చిన్న సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ పరంగా ఇదే కాస్త పెద్ద సినిమా అనిపించుకోవడం ఈ సినిమాకి కలిసొచ్చిన అంశమే. అయితే, కంటెంట్ పరంగా సినిమా ఆకట్టుకుందో లేదో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
శ్రీ కుమార్ (అల్లు శిరీష్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రోడు. అమెరికా నుంచి వచ్చిన అమ్మాయ్ సింధూజ( అనూ ఇమ్మాన్యుయేల్). ఇద్దరూ కలిసి ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుంటారు. తొలి చూపులోనే సింధూజ ప్రేమలో పడతాడు శ్రీ. ఆమెకి బాగా దగ్గరైపోతాడు శారీరకంగా కూడా. లవ్ ప్రపోజ్ చేసే టైమ్‌లో స్వతంత్ర భావాలున్న సింధూజ, శ్రీ ప్రేమను తిరస్కరిస్తుంది. సహజీవనం చేసేందుకు ఒప్పుకుంటుంది. మనసులో ప్రేమ లేకుండా సహజీవనం సాధ్యమైందా.? అసలు ప్రేమ, పెళ్లిని సింధూజ కాదనడానికి కారణాలేంటీ.? మిడిల్ క్లాస్ అబ్బాయ్ శ్రీ, సింధూజతో రిలేషన్‌ని ఎలా మ్యానేజ్ చేశాడు.? తెలియాలంటే సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

నటీ నటుల పని తీరు:
మిడిల్ క్లాస్ అబ్బాయిలా అల్లు శిరీష్ బాగా ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోల్చితే, నటనలోనూ పరిణీతి చూపించాడు. అమెరికా రిటర్న్స్ ట్రెండీ అమ్మాయి పాత్రకు అనూ ఇమ్మాన్యుయేల్ బాగా సెట్ అయ్యింది. సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ పాత్రలు సినిమాకి మెయిన్ హైలైట్. ఆమని, పృద్వీ తదితర పాత్రలు పరిధి మేర బాగానే నటించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
కథ పాతదే అయినా యువతరానికి కనెక్ట్ అయ్యే కథాంశంతో సినిమాని నడిపించిన తీరు దర్శకుడ్ని మెచ్చుకునేలా చేస్తుంది. పాటలు కథనానికి తగ్గట్లుగా ఆకట్టుకుంటాయ్ చిత్రీకరణ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయ్. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. మిగిలిన టెక్నీషియన్ టీమ్ తమకిచ్చిన వనరుల్లో మెరుగైన పని తీరు కనబరిచారు. 

విశ్లేషణ:
ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లుగా లవ్, రొమాన్స్, సహజీవనం కాన్పెప్టుతో యూత్‌ని ఎట్రాక్ట్ చేయడంలో ఈ సినిమాతో రాకేష్ శశి సక్సెస్ అయ్యాడు. కథ పాతదే అయినా, ప్రేక్షకున్ని సీట్లో కూర్చోబెట్టే కామెడీతో కథనాన్ని గ్రిప్పింగ్‌గా నడిపించాడు. ఓటీటీ, సోషల్ మీడియా, సీరియల్స్ నేపథ్యాన్ని వాడి వెన్నెల కిషోర్‌కి రాసిన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. అలాగే సునీల్‌కి క్రికెట్ నేపథ్యంలో రాసిన కామెడీ డైలాగులు సూపర్బ్. హీరో, హీరోయిన్ల మధ్య సాగే కెమిస్ర్టీని ఈ ఇద్దరు కమెడియన్లు వర్ణించిన వైనం ప్రేక్షకున్ని కడుపుబ్బా నవ్విస్తాయ్. అక్కడక్కడా లిప్‌లాక్ సీన్స్, హద్దులు మీరిన కెమిస్ర్టీ కాస్త ఇబ్బంది పెట్టినా సినిమాటిక్ లిబర్టీలో కొట్టుకుపోతాయ్. కొత్తదనం ఆశించకుండా, ఆధ్యంతం కామెడీని ఎంజాయ్ చేయడానికి ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా బాగానే మార్కులేయించుకుంటుంది. 

ప్లస్ పాయింట్స్:
కామెడీ,
ఫస్టాఫ్, మ్యూజిక్..

మైనస్ పాయింట్స్:
ఊహకు అందేలా సాగే కథనం, సెకండాఫ్‌లో కొద్దిగా సాగతీత అంశాలు..

చివరిగా: ‘ఊర్వశివో రాక్షసివో’ ఓ మంచి యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com