అల్లు వారి కోడలు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందా.?
- November 04, 2022
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో బోలెడంత మంది అభిమానులున్నారు. అందుకు కారణం నెట్టింట్లో అల్లు స్నేహా రేడ్డి యాక్టివ్‌గా వుండడమే.
ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో పాటూ, డిఫరెంట్ గ్లామర్ లుక్స్‌లో తన పర్సనల్ ఫోటోస్ కూడా షేర్ చేస్తుంటుంది స్నేహా రెడ్డి.
హీరోయిన్లకు ఎంత మాత్రమూ తీసిపోని గ్లామర్ ఫోటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది స్నేహా రెడ్డి. ఈ మధ్య స్నేహా రెడ్డి గ్లామ్ షూట్స్ ఇంకాస్త వేగం పుంజుకున్నాయ్.
ఒకప్పుడు అరుదుగా మాత్రమే చేయించుకునే ఫోటో షూట్లను ఇప్పుడు కంటిన్యూస్‌గా స్నేహా ఫాలో చేస్తోంది. దాంతో, సోషల్ మీడియాలో ఆమె పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. స్నేహా అందాల ఫోటోలకు ఫిదా అయిన మాలీవుడ్ ఫిలిం మేకర్లు ఆమెకు ఓ అదిరిపోయే ఛాన్స్ ఆఫర్ చేశారట.
స్నేహాతో సినిమా తీసేందుకు ముందుకొచ్చారట. ఆ సినిమాలో నటించేందుకు స్నేహ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే, తెలుగులో కాకుండా, మలయాళంలో స్నేహా రెడ్డి సినీ కెరీర్ స్టార్ట్ చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. మలయాళంలో ఓ స్టార్ హీరో సినిమా కోసం స్నేహారెడ్డితో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.
........
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!