సమంత-విజయ్ దేవరకొండ: ‘ఖుషి’ సినిమా వచ్చేదెప్పుడంటే.!
- November 04, 2022
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా ‘ఖుషీ’. ఈ సినిమాని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు.
డిశంబర్‌లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రచార చిత్రాలు కూడా సిద్ధం చేశారట. అయితే, కొన్ని కారణాల వల్ల షూటింగ్ కంప్లీట్ కాలేదనీ దాంతో రిలీజ్ టైమ్ అనుకున్న సమయం కన్నా ఇంకాస్త ఆలస్యమవుతోందని తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఈ సినిమా కోసం ఆడియన్స్‌తో పాటూ, తానూ ఓ ఆడియన్‌లాగే ఎదురు చూస్తున్నానని విజయ్ చెప్పారు. సమంత మంచి నటి. ఆమెతో కలిసి నటించడం నా అదృష్టం.. సమంతపై తనకున్న ఇష్టాన్ని ఈ సందర్భంగా తెలిపాడు విజయ్ దేవరకొండ.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నామని విజయ్ తెలిపాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న సినిమా ‘ఖుషి’. తొలి పోస్టర్, టైటిల్ నుంచే ఈ సినిమా భారీగా అంచనాలు
క్రియేట్ చేసింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







