హైదరాబాద్ లో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి…
- November 05, 2022
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శనివారం మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు వెళ్లి, చెరువులో మునిగి ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మృతులను హైదరాబాద్, అంబర్పేట ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
వీళ్లంతా ఒక ఫంక్షన్ కోసం అంబర్పేట్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు స్థానికులు చెప్పారు. సరదాగా ఈత కోసం వెళ్లి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చెరువులో మునిగి మరణించిన వారి మృతదేహాల్ని వెలికితీస్తున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







