మెగా ఫ్యాన్స్ స్ట్రెయిట్ క్వశ్చన్: చిరంజీవి సినిమాకి ఐటెం సాంగ్ అవసరమా.?
- November 05, 2022ఈ మధ్య చిరంజీవి నటించిన సినిమాల్లో ఐటెం సాంగ్స్ పెద్దగా కలిసి రావడం లేదు. తేలిపోతున్నాయి. కారణాలేమైనా కావచ్చు.. ఆయా ఐటెం సాంగ్స్ పెద్దగా క్రేజ్ దక్కించుకోలేదు.
‘ఆచార్య’ ఫ్లాప్ కావడం వల్లనేమో రెజీనాతో చేసిన ఐటెం సాంగ్ తేలిపోయింది. ‘గాడ్ ఫాదర్’ హిట్ అయినా కానీ, ఈ సినిమాలో ఐటెం సాంగ్ స్టోరీ రిలేటెడ్ కావడంతో పెద్దగా పాపులర్ కాలేదు.
ఈ నేపథ్యంలో చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేర్ వీరయ్య’ ఐటెం సాంగ్‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని చిరంజీవి మార్కు మాస్ స్టైలింగ్‌లో చిత్రీకరిస్తున్నారు. ఆ విషయాన్ని ఆల్రెడీ రీసెంట్ టీజర్‌తో ప్రూవ్ చేసేశారు.
అలాంటి మాస్ సినిమాకి ఓ ఐటెం సాంగ్ ఖచ్చితంగా వుండి తీరాలి కదా. అందుకే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాని ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం తీసుకొచ్చారట. ఆల్రెడీ ఈ సాంగ్ షూటింగ్ కూడా అయిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అంతా బాగానే వుంది కానీ, చిరంజీవిని చూసేందుకే రెండు కళ్లూ చాలవు. అలాంటప్పుడు ఆయన సినిమాలో ఇక ఐటెం సాంగ్ అవసరమా.? అనేది ఓ వర్గం ఫ్యాన్స్ అభిప్రాయం. అదీ సంగతి.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్‌లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







