అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం
- November 05, 2022
కువైట్: హవల్లీ ప్రాంతంలో అపార్ట్మెంట్లో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. అయితే, సకాలంలో స్పందించిన ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపు చేశారు. హవల్లీలోని అపార్ట్మెంట్ భవనంలోని నాల్గవ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించిందని సమాచారం అందగానే ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ హవల్లీ, సాల్మియా కేంద్రాల నుండి అగ్నిమాపక బృందాలు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయని ఫైర్ సర్వీస్, పబ్లిక్ రిలేషన్స్ విభాగం పేర్కొంది. అనంతరం అపార్టుమెంటులోని నివాసితులను సురక్షితంగా ఖాళీ చేయించిందని తెలిపింది. సకాలంలో మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొంది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







