దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డు మూసివేత
- November 05, 2022
దుబాయ్: ఎమిరేట్ ప్రధాన రహదారి షేక్ జాయెద్ రోడ్ నవంబర్ 6న ఉదయం 4 నుండి ఉదయం 9 గంటల వరకు మూసివేయబడుతుందని దుబాయ్ యొక్క రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తెలియజేసింది. దుబాయ్ రైడ్‌ను పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్‌లోని ప్రధాన ఈవెంట్లలో రైడ్ ఒకటి. ఇది ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ నుండి సఫా పార్క్ ఇంటర్చేంజ్ (2వ ఇంటర్చేంజ్) వరకు షేక్ జాయెద్ రోడ్‌కు రెండు దిశలలో నిర్వహించబడుతుందని అథారిటీ తెలిపింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. సైక్లింగ్ ఈవెంట్ లో పాల్గొనే వారు మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, దుబాయ్ వాటర్ కెనాల్, బుర్జ్ ఖలీఫాతో సహా దుబాయ్ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లను చూస్తూ వెళ్లవచ్చని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి
- ఈ దేశ పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్ చేసిన ట్రంప్
- బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు..
- సౌదీ బస్సు ప్రమాదం పై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!







