మాజీ భార్యకు Dhs110,000 చెల్లించాలని ఆదేశించిన కోర్టు
- November 06, 2022
అబుధాబి: వివాహ సమయంలో తన మాజీ భార్య వద్ద అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఓ వ్యక్తిని అబుధాబి కుటుంబ, సివిల్, అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తన మాజీ భర్త వివాహ సమయంలో తన నుంచి 70,000 దిర్హాన్లు అప్పుగా తీసుకున్నట్లు ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. దీనితో పాటు కోర్టు ఫీజులు, ఖర్చులు, న్యాయవాది ఫీ, 12% చట్టపరమైన వడ్డీతో కలిపి Dhs110,000 ఇప్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. తన మాజీ భార్యకు Dhs110,000 చెల్లించాలని వ్యక్తిని ఆదేశించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!
- విమాన ఛార్జీలపై పరిమితులను ఉపసంహరించుకున్న భారత్..!!









