ఒమన్‌లో రెంటల్స్, యుజ్డ్ కార్ల వ్యాపారానికి పెరుగుతున్న డిమాండ్
- November 06, 2022
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో రెంటల్స్, యుజ్డ్ కార్ల వ్యాపారానికి డిమాండ్ పెరుగుతున్నది. స్థానిక ఆటోమొబైల్ డీలర్‌ల వద్ద కొత్త కార్ మోడల్స్ అందుబాటులో లేకపోవడం కూడా ఈ బిజినెస్ అభివృద్ధికి కారణం అవుతుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. అలాగే సెమీకండక్టర్ చిప్‌ల కొరత కూడా కొత్త కార్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. దీంతో కార్ల కోనుగోలుదారులు కొత్త కార్ల కోసం వేచి ఉండకుండా.. అందుబాటులో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా మెజారిటీ బ్రాండ్‌లలో కొత్త మోడల్స్ రావడంలో ఆలస్యం అవ్వడంతో కార్ ఓనర్‌లు తమ పాత వాహనాలను ఎక్కువ కాలం ఉంచుకోవాల్సి వస్తుంది. మరోవైపు కార్ల ఉత్పత్తిలో తలెత్తిన సమస్యలు 2023 వరకు కొనసాగుతాయని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







