కువైట్ లో 127 మంది ప్రవాసులు అరెస్ట్!
- November 06, 2022
కువైట్ సిటీ: కువైట్ లో ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. అంతర్గత మంత్రిత్వశాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ అధికారులు, కువైత్ పోలీసులు ప్రవాసులు అధికంగా ఉండే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ సోదాల్లో కార్మిక, రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనలతో పాటు ఇతర నేరాలకు పాల్పడే ప్రవాసులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుంది.ఇదే కోవలో శుక్రవారం సాల్మి ప్రాంతంలో పీఏఎం, అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో 127 మంది వలసదారులను అదుపులోకి తీసుకున్నారు.వీరందరూ కార్మిక చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, వీరిలో 93 మంది కార్మికులు అర్టికల్ 18 వీసా, 19 మంది కార్మికులు అర్టికల్ 20 వీసా పై ఉన్నారు.మరో 15 మంది యజమానుల నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నవారు అని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా యజమానులు, ప్రవాస కార్మికులకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ అధికారులు కీలక సూచనలు చేశారు. యాజమాన్యం, కార్మికులు తప్పనిసరిగా కార్మిక చట్టాలకు కట్టుబడి ఉండాలని అన్నారు.ఎట్టిపరిస్థితుల్లో ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు.లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.కార్మిక, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే ప్రవాసులను ఉపేక్షించబోమని, నేర తీవ్రతను బట్టి దేశ బహిష్కరణ కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







