సౌదీలో వారంలో 16,583 అక్రమార్కులు అరెస్ట్
- November 06, 2022
రియాద్: రెసిడెన్సీ, వర్క్, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక వారంలో 16,583 మందిని అరెస్టు చేసినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. అక్టోబరు 27 నుండి నవంబర్ 2 వరకు రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించినందుకు మొత్తం 10,007 మందిని అరెస్టు చేయగా, చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటడానికి ప్రయత్నించినందుకు 4,404 మందిని, కార్మిక సంబంధిత ఉల్లంఘనలపై మరో 2,172 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా రాజ్యంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినందుకు అరెస్టయిన 321 మందిలో 43 శాతం మంది యెమెన్లు, 51 శాతం మంది ఇథియోపియన్లు, 6 శాతం మంది ఇతర జాతీయులు ఉన్నారని నివేదిక పేర్కొంది. అలాగే పొరుగు దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ మరో 69 మంది పట్టుబడ్డారని తెలిపింది. రాజ్యంలోకి అక్రమ మార్గాల ద్వారా వచ్చే వారికి సహాయం చేస్తున్నట్లు తేలితే గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, SR1 మిలియన్ ($260,000) వరకు జరిమానా లేదా వారి వాహనాలను జప్తు చేసే అవకాశం ఉందని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అక్రమార్కుల వివరాల తెలిస్తే.. మక్కా, రియాద్ ప్రాంతాలలో టోల్-ఫ్రీ నంబర్ 911, ఇతర ప్రాంతాలలో 999 లేదా 996కు కాల్ చేసి తెలపాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!







