20 వృత్తుల్లో ప్రవాసులకు ప్రొఫెషన్ పరీక్షలు
- November 06, 2022
కువైట్: ప్రవాసులకు 20 వృత్తుల్లో ప్రొఫెషన్ పరీక్షలను ఆయా దేశాల్లోని కువైట్ రాయబార కార్యాలయాల భాగస్వామ్యంతో నిర్వహించడానికి చర్యలు చేపట్టినట్లు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) ప్రకటించింది. ప్రవాసులను పరీక్షించడానికి స్మార్ట్ మెకానిజంను రూపొందించే లక్ష్యంతో ప్రవాస కార్మికులను నియమించే అగ్ర వృత్తుల జాబితాను రూపొందించినట్లు అథారిటీ పేర్కొంది. రెండు విభాగాల్లో పరీక్షలు సాగుతాయని.. ప్రాక్టికల్స్ కువైట్‌లో ఉంటాయని, థియరిటికల్ రిక్రూట్‌మెంట్ ఆయా దేశాలలో ఎంబసీల సాయంతో నిర్వహించనున్నట్లు వివరించింది. కువైట్ ఇంజనీర్స్ సొసైటీ ఇంజనీరింగ్ రంగంలోని కార్మికులకు మద్దతుగా 71 వృత్తులపై నిర్వహించే వృత్తిపరమైన పరీక్షల కోసం ఒక కేంద్రాన్ని సిద్ధం చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







