ఒమన్‌లో రికార్డు స్థాయిలో వాహన రిజిస్ట్రేషన్లు
- November 06, 2022
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన తాజా డేటా ప్రకారం.. సెప్టెంబర్ 2022 చివరి నాటికి ఒమన్ సుల్తానేట్‌లో నమోదైన మొత్తం వాహనాల సంఖ్య 1.58 మిలియన్లకు చేరుకుంది. ఒమన్‌లో నమోదైన మొత్తం వాహనాల్లో ప్రైవేట్ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలు 1,260,833 (79.5 శాతం) ఉన్నాయి. వాణిజ్య రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల సంఖ్య 236,867(14.9%)కి చేరుకున్నాయి. అదే సమయంలో టాక్సీ వాహనాలు 28,186(1.8 శాతం)కి చేరాయి. అద్దె వాహనాల సంఖ్య 26,932(1.7 శాతం)కి చేరుకున్నాయి. ప్రభుత్వ వాహనాల సంఖ్య 12,158 కాగా.. మోటార్‌బైక్‌ల సంఖ్య 6,623గా ఉంది. అలాగే ట్యూటరింగ్ వాహనాల సంఖ్య 5,806 , తాత్కాలిక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాల సంఖ్య 7,438గా ఉంది. వీటితోపాటు వ్యవసాయ ట్రాక్టర్ల సంఖ్య 1,284, దౌత్య సంస్థల రిజిస్ట్రేషన్లు కలిగిన వాహనాలు 820 ఉన్నాయని ఎన్సీఎస్ఐ తన నివేదికలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







