గడువు ముగిసిన వస్తువుల విక్రయం.. వాణిజ్య సంస్థ సీజ్
- November 06, 2022
మస్కట్ : గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్న ఓ వాణిజ్య సంస్థను ముసండంలోని ఖాసబ్‌లోని వినియోగదారుల రక్షణ విభాగం సీజ్ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం అమలును పర్యవేక్షించేందుకు నిరంతరం తనిఖీ డ్రైవ్‌లను కొనసాగిస్తామని కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీపీఏ) ప్రకటించింది. ఇందులో భాగంగానే ఖాసబ్‌లోని ఓ వాణిజ్య సంస్థలో గడువు ముగిసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గడువు ముగిసిన వస్తువులను విక్రయించిన వాణిజ్య సంస్థపై జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. మార్కెట్‌లలో గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్నా.. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన విషయాలను గుర్తిస్తే అధికారిక మార్గాల ద్వారా తెలపాలని వినియోగదారులకు సీపీఏ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







