మాజీ భార్య కారును దొంగిలించిన వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష
- November 07, 2022
బహ్రెయిన్: తన మాజీ భార్య సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆమె అనుమతి లేకుండా ఆమె కారును విక్రయించినందుకు దోషిగా తేలిన నలభై ఏళ్ల వ్యక్తికి బహ్రెయిన్ హైకోర్టు మూడేళ్లపాటు జైలుశిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తమ కుమారుడిని కలిసేందుకు వెళుతుండగా.. కారు చెడిపోయింది. దీంతో తన మాజీ భర్తకు విషయాన్ని తెలిపానని, అతను తమ వద్దకు వచ్చి, ఇసా టౌన్‌లోని ఒక దుకాణం నుండి కారును రిపేర్ చేయమని మెకానిక్ కు కారును అప్పగించాడు. మరుసటి రోజు కారును తీసుకునేందుకు మెకానిక్ షెడ్డుకు వెళ్గగా.. అక్కడ కారు కనిపించలేదు. తన మాజీ భర్త కారును తీసుకెళ్లాడని చెప్పారు. వెంటనే అతనికి కాల్ చేయగా.. అతను కారు కోసం BD2,000 డిమాండ్ చేశాడు. తర్వాత, అతను నా సంతకాన్ని ఫోర్జరీ చేసి కారును విక్రయించాడని సదరు మహిళ తన పిటిషన్ లో వెల్లడించింది. తమ విచారణలో నిందితుడు తాను చేసిన నేరాలను అంగీకరించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టులో వెల్లడించారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







