తొలగింపుల ప్రక్రియలో పొరపాటు జరిగింది:ట్విట్టర్
- November 07, 2022
అమెరికా: ట్విట్టర్ లో దాదాపు సగం మంది ఉద్యోగులను ఆ సంస్థ తొలగించిన విషయం తెలిసిందే! అయితే, ఈ తొలగింపుల ప్రక్రియలో పొరపాటు జరిగిందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. కొంతమంది ఉద్యోగులను పొరపాటున ఇంటికి పంపినట్లు తెలిపాయి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తిరిగి రమ్మని వారికి లేఖలు పంపినట్లు వివరించాయి. ఈమేరకు బ్లూమ్ బర్గ్ ఆదివారం ఓ కథనం వెలువరించింది.
సంస్థలోని కమ్యూనికేషన్, కంటెంట్ క్యురేషన్, హ్యూమన్ రైట్స్, మెషిన్ లెర్నింగ్ తదితర శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులలో సగం మందిని మస్క్ ఇంటికి పంపించేశారు. ఇందులో కొంతమంది సేవలు కంపెనీకి అవసరం ఉంటుందని, వారి తొలగింపు విషయంలో పొరపాటు జరిగిందని బ్లూమ్ బర్గ్ కథనంలో పేర్కొంది. ట్విట్టర్ లో ఆ సంస్థ కొత్త యజమాని ఎలాన్ మస్క్ తీసుకురాబోయే సరికొత్త మార్పులకు ఈ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో తొలగించిన ఉద్యోగులలో కొంతమందికి తిరిగి వచ్చేయాలంటూ ట్విట్టర్ ఆహ్వానం పంపినట్లు బ్లూమ్ బర్గ్ పేర్కొంది. అయితే, ఈ కథనంపై ట్విట్టర్ అధికారికంగా స్పందించలేదు. మరోపక్క, బ్లూ టిక్ చార్జీల పెంపును అమలు చేసేందుకు అవసరమైన మార్పులను ట్విట్టర్ చేపట్టింది. ఇందులో భాగంగా యాపిల్ యాప్ స్టోర్ లో ట్విట్టర్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ను అప్ లోడ్ చేసింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







