నదిలో కుప్పకూలిన విమానం.. 19 మంది దుర్మరణం!
- November 07, 2022
టాంజానియా: టాంజానియాలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలో ప్రయాణికుల విమానం ల్యాండ్ అవుతుండగా నదిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రెసిషన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బుకోబాలో ల్యాండ్ అవుతుండగా పైలట్ నియంత్రణ కోల్పోవడంతో ఎయిర్పోర్ట్ సమీపంలోని విక్టోరియా సరసులో విమానం కుప్పకూలింది.
విమానం దార్ ఎస్ సలామ్ నుంచి బుకోబా వయా మంవాంజా మీదుగా వెళ్తోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 26 మందిని రిలీఫ్ అండ్ రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు.
కగేరా ప్రావిన్స్‌కు చెందిన పోలీసు కమాండర్ విలియం మ్వాంపాఘలే మాట్లాడుతూ ఘటనలో గాయపడ్డ వారిని రక్షించామని పేర్కొన్నారు. విమానం దాదాపు 100 మీటర్ల ఎత్తులో ప్రతికూల వాతావరణం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వివరించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







