ఆది పురుష్ వాయిదా.! రిలీజ్ ఎప్పుడంటే.!
- November 07, 2022
ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆది పురుష్’ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వీఎఫ్ఎక్స్ పనుల్లో ఈ సినిమా బిజీగా వుంది. రీసెంట్గా రిలీజ్ చేసిన ‘ఆది పురుష్’ టీజర్ నెగిటివిటీని మూట కట్టుకోవడంతో, మేకర్లు వెనక్కి తగ్గారు.
ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేసుకున్న ‘ఆది పురుష్’ ఈ సంక్రాంతికి బరిలో దిగేందుకు సిద్ధమైంది కూడా. అయితే, శాంపిల్‌గా రిలీజ్ చేసిన టీజర్‌కి రెస్పాన్స్ బాగోకపోవడంతో మేకర్లు ఆలోచన మార్చుకున్నారు. గ్రాఫిక్స్ పార్ట్ అంతా మళ్లీ మొదట్నుంచీ చేయాలని డిసైడ్ అయ్యారట. దాంతో, ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా వుంది.
అదే విషయమై గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. తాజాగా ఆ పుకార్లను నిజం చేస్తూ, ‘ఆది పురుష్’ టీమ్ ఓ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నామంటూ అదికారికంగా ప్రకటించేసి కొత్త రిలీజ్ డేట్ కూడా రిలీజ్ చేసింది.
‘ఆది పురుష్’అనేది కేవలం సినిమానే కాదు, అది ఓ సంస్కృతి, సాంప్రదాయం, చర్రిత.. అందుకే, ప్రేక్షకులు మా సినిమాని చూసి సంతృప్తిగా ఫీలవ్వాలి. ఎలాంటి నెగిటివిటీ ఎత్తకూడదు..’ అంటూ డైరెక్టర్ ఓంరౌత్ తెలిపారు. ఈ కారణాలతోనే సినిమాపై ఫోకస్ మరింత ఎక్కువ చేస్తున్నామనీ అందుకు ఇంకాస్త టైమ్ కావాలని తెలిపారు.
‘ఆది పురుష్’తో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని ఫీలవ్వాలన్న ఆశతోనే సినిమా రిలీజ్ డేట్‌ని 2023 జూన్ 16 కు మారుస్తున్నామంటూ ఓం రౌత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తాజా ప్రకటనతో ప్రబాస్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లేసినట్లయ్యింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







