నవంబర్ 11న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌కు షారుక్ ఖాన్!
- November 07, 2022
యూఏఈ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నవంబర్ 11న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌కు అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు షార్జా బుక్ అథారిటీ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రకటించింది. నవంబర్ ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై ఈ బాలీవుడ్ స్టార్ 57వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న మొదటి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ నిలిచాడు. అలాగే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ ద్వారా హ్యాపీనెస్ కార్డ్‌ను కూడా అందుకున్నాడు. షారూఖ్.. దుబాయ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం ఈజిప్షియన్ నటుడు అహ్మద్ అల్ సక్కా, భారతీయ రచయిత దీపక్ చోప్రా, ఇటాలియన్ రచయిత్రి ఎలిసబెట్టా డామీలు షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌ను సందర్శించారు.
తాజా వార్తలు
- ఇరాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసిన సలాంఎయిర్..!!
- బహ్రెయిన్ లో స్ట్రీట్ వెండర్స్ కు కొత్త నిబంధనలు..!!
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!







