రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- January 10, 2026
సూళ్లూరుపేట: ఎల్విఎం3-ఎం6 భారీ విజయం తర్వాత మరో గఘన విజయానికి ఇస్రో సిద్ధమవుతోంది.ఇందుకు సంబంధించి పిఎస్ఎల్వి-సి62 రాకెట్ ద్వారా ఎస్ఎల్వి-సి62 రాకెట్ ద్వారా జనవరి 12న ఉదయం 10 గంటల 17 నిముషాలకు అన్వేష్ (IOS-N1) ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నది.దీనితో పాటు మరో 15 వాణిజ్య ఉపగ్రహాలను కూడా రోదశిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం ఉదయం 10 గంటల 17 నిము షాలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 24 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగి సోమవారం పిఎస్ఎల్వి-సి62 రాకెట్ నింగిలోకి ఎగురుతుంది.
శ్రీహరికోట లోని ఇంటిగ్రేషన్ ఫెసిలిటి భవనం (PIF) లో రాకెట్ అనుసంధాన కార్యక్రమాలు పూర్తయ్యాయి.ఈ ప్రయోగంలో 1,485 కేజీల బరువు ఉన్న అన్వేష్ ఉపగ్రహాన్ని ప్రయోగి స్తున్నారు. ఇది అత్యంత కీలకమైన ఉపగ్రహం. ఇప్పటి వరకు భారత రక్షణ వ్యవస్థకు మూడోనేత్రంలా పనిచేసే భూపరిశీలన ఉపగ్రహాలను అనేకం ఇస్రో అంతరిక్షంలోకి వంపి ఉంది. భూపరిశీలన చేసిన తర్వాత సమాచా రాన్ని భూమికి చేరవేసే ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ ఉపగ్రహానికి అన్వేష్ అనే నామకరణం చేశారు.
ఈ ఉపగ్రహం సైనిక అవసరాల నిఘా నిమిత్తం భూమికి, 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ సమాచారాన్ని భూతలంలోని కంట్రోల్ సెంటర్‌కు చేరవేస్తుంది. ఈ ప్రయోగంలో స్పానిష్కు చెందిన స్టార్టప్ ఆర్బిటల్ పారడైజ్ భాగస్వామ్యంతో నిర్మించిన 25 కేజీల బరువు గల క్రిస్టల్ ఇనిషియల్ డెమానుస్ట్రేటర్ (KID) క్యాప్సూ లను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ప్రయోగా త్మకంగా ప్రయోగించిన క్యాప్సూల్‌ను తిరిగి భూవాతా. వరణంలోకి ప్రవేశించడం కోసం దక్షిణ పసిఫిక్ మహాస ముద్రంలో ఓ స్మాష్ డౌన్ జోన్‌ను గుర్తించారు.పిఎస్ ఎల్వీ ప్రయోగాల్లో ఇది 64వది. ఇస్రో ప్రయోగిస్తున్న 104వ ఉపగ్రహ ప్రయోగం ఇది.చంద్రయాన్-1, మార్క్ ఆర్బిటల్ మిషన్, ఆదిత్య ఎల్1, ఆస్ట్రోశాట్ మిషన్ అనే ముఖ్యమైన ప్రయోగాల్లో ఉపగ్రహాలను గమ్యస్థానానికి చేర్చడంలో పిఎస్ఎల్వి రాకెట్ తన సత్తా చాటింది. 2017 సంవత్సరంలో ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో రికార్డు సృష్టిం చింది. ప్రస్తుతం ఈ ప్రయోగంపై షార్ శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. పిఎస్ఎల్వి-సి61 మూడో దశలో ప్రయోగం ఆశించినంత విజయవంతం కాలేదు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







