వేములవాడ రాజన్న ఆలయం మూసివేత
- November 08, 2022
తెలంగాణ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నేడు మధ్యాహ్నం 2.38 గంటల నుంచి చంద్రగహణం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉదయం స్వామివారి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ద్వారాలను మూసివేశారు. అలాగే అనుబంధ ఆలయాల్లోనూ పూజల అనంతరం ద్వారాలను మూసివేశారు. చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 6.18 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి ఆలయ ఆవరణలో జ్వాలాతోరణం నిర్వహించడంతో పాటు స్వామివారి మహాపూజ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







