కారుకు నిప్పుపెట్టి.. కాల్పులకు తెగబడ్డ 9 మంది అరెస్ట్
- November 08, 2022
సౌదీ: డ్రగ్స్ వివాదం నేపథ్యంలో రియాద్‌లోని కార్ షోరూమ్‌పై దాడిచేసి కారుకు నిప్పుపెట్టి, తుపాకీ కాల్పులు జరిపిన తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు సౌదీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతోంది. ఒక క్లిప్‌లో మెర్సిడెస్ ఫోర్-వీల్-డ్రైవ్ వాహనం మంటల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తుండగా... మరో క్లిప్‌లో ఆటోమేటిక్ రైఫిల్ నుండి తుపాకీ శబ్దాలు వినిపించడంతో కార్ షోరూమ్‌లోని వ్యక్తులు భయాందోళనలకు గురై పరుగెత్తే దృశ్యాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మంది సౌదీ పౌరులు, ఒక ప్రవాసిని అరెస్టు చేసినట్లు సౌదీ పోలీసులు వెల్లడించారు. మొత్తం తొమ్మిది మందిపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం కింగ్‌డమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరికొందరు నిందితులను కూడా గుర్తించామని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







