ప్రస్తుతానికైతే చావలేదు.! యశోద ప్రమోషన్లలో సమంత.!
- November 08, 2022
అనారోగ్యంతో సమంత ఈ మధ్య సోషల్ మీడియాకి దూరంగా వుంటోన్న సంగతి తెలిసిందే. ‘యశోద’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, సమంత ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లింది. అయితే, సమంత అనారోగ్యంపై పలు పుకార్లు షికార్లు చేశాయ్.
వన్ ఫైన్ డే, సమంత తన అరుదైన వ్యాధి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో, అంతా షాకయ్యారు. ఆ తర్వాత సమంతకున్న వ్యాధి మీద రీసెర్చుల మీద రీసెర్చులు చేసి, సమంత ప్రాణాపాయ స్థితిలో వుందంటూ, పలు కథనాలు మొదలు పెట్టేశారు.
సమంత నటించిన ‘యశోద’ సినిమా మరో నాలుగు రోజుల్లో రిలీజ్‌కి రెడీగా వుంది. సమంత ప్రస్తుతం వున్న కండిషన్లో ఆమె ప్రమోషన్లకు రాలేదని భావించారంతా. ఈ సినిమాలో మరో కీలక పాత్రధారి అయిన వరలక్ష్మి శరత్ కుమార్ వైపు నుంచి ఆల్రెడీ ప్రమోషన్లు స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.
అయితే, సడెన్‌గా మీడియా ముందుకొచ్చి సమంత అందరికీ షాకచ్చింది. తన హెల్త్ కండిషన్ గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఒకానొక టైమ్‌లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేననుకున్నా.. కానీ, ఇప్పుడు కోలుకుంటున్నా.. నా ఆరోగ్యంపై పలు అనవసరమైన కథనాలు విన్నాను. కానీ, అవేమీ నిజం కావు. ప్రస్తుతానికైతే చావలేదు..’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది సమంత.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!