10 నెలల్లో 3 వేల జీతాల చెల్లింపు ఉల్లంఘనలు నమోదు
- November 10, 2022
యూఏఈ: 2022 జనవరి - అక్టోబర్ మధ్య యూఏఈలో 3 వేల జీతాల చెల్లింపు ఉల్లంఘనలు నమోదు అయినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) వెల్లడించింది. యూఏఈలో వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రైవేట్ రంగ సంస్థల్లో 485,000 తనిఖీలు చేపట్టారని, ఈ సందర్భంగా 26,104 కార్మిక చట్ట ఉల్లంఘనలను నమోదు చేసినట్లు తెలిపింది. చట్టాలను ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాట్లు పేర్కొన్నది. కార్మిక ఉల్లంఘనలలో వేతనాలు చెల్లించని 2,973 కేసులు నమోదయినట్లు తెలిపింది. ఈ కేసులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఉద్యోగుల పాస్‌పోర్ట్‌లను యాజమాన్యాలు వెనక్కు తీసుకున్న 178 కేసుల్లో 132 పరిష్కరించబడ్డాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!







