వీసా రద్దు తర్వాత 6 నెలల గ్రేస్ పీరియడ్
- November 10, 2022
యూఏఈ: రెసిడెన్సీ వీసా రద్దు తర్వాత యూఏఈ నుండి వెళ్లేందుకు గ్రేస్ పీరియడ్ ను 60 నుండి 180 రోజులకు పెంచుతూ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (ICP) నిర్ణయించింది. సాధారణంగా ప్రవాసుల వీసా రద్దు తర్వాత గ్రేస్ పీరియడ్లోగా దేశం నుండి వెళ్లాలి లేదా కొత్త వీసా పొందాల్సి ఉంటుంది.
180 రోజుల గ్రేస్ పీరియడ్ ను గోల్డెన్ వీసా హోల్డర్లు, గ్రీన్ వీసా హోల్డర్లు వారి వారి కుటుంబ సభ్యులు, వితంతువులు లేదా విడాకులు తీసుకున్నవారు, చదువు పూర్తి చేసిన విద్యార్థులు, నైపుణ్యం కలిగిన నిపుణులు (మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఎమిరేటైజేషన్ వర్గీకరణలో మొదటి, రెండవ స్థాయి) ఉన్నవారికి వర్తిస్తుంది.
90 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రం నైపుణ్యం కలిగిన నిపుణులు (మానవ వనరులు, ఎమిరటైజేషన్ వర్గీకరణ మంత్రిత్వ శాఖలో మూడవ స్థాయి), యూఏఈలో ఆస్తి యజమానులకు వర్తించనుంది. 60 రోజుల గ్రేస్ పీరియడ్ సాధారణ నివాసాల వారికి.. ఇతర వర్గాల వారికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ అమల్లో ఉన్నది. అయితే, కొంతమంది నైపుణ్యం కలిగిన కార్మికులు 180 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పొందినప్పటికీ, వారిపై ఆధారపడిన వారికి కేవలం 60 రోజుల గ్రేస్ పీరియడ్ ను మాత్రమే అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!