యూఏఈలో మొదటిసారి.. రస్ అల్ ఖైమా రిసార్ట్‌లో కాసినో!
- November 11, 2022
రస్ అల్ ఖైమా: యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో నిర్మిస్తున్న లగ్జరీ రిసార్ట్‌లో క్యాసినోను ప్రారంభించనున్నట్లు ప్రముఖ హోటల్, క్యాసినో ఆపరేటర్ విన్ రిసార్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రెయిగ్ స్కాట్ బిల్లింగ్స్ ధృవీకరించారు. యూఏఈలో ప్రస్తుతం గ్యాంబ్లింగ్ పై నిషేధం అమల్లో ఉన్నది. మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాల కంటే సాంప్రదాయకంగా కఠినమైన ఇస్లామిక్ నియమాలను పాటించే గల్ఫ్‌లో క్యాసినో ఏర్పాటు ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. వ్యాపారం, పర్యాటక కేంద్రంగా ఉన్న యూఏఈ.. తన చమురు-ఆధారిత ఆర్థిక వ్యవస్థను ఇతర రంగాల దిశగా మళ్లించే క్రమంలో గో-టు డెస్టినేషన్‌గా మారడానికి అడుగులు వేస్తోంది. ఈ విషయంలో సౌదీ అరేబియాతో పోటీపడుతోంది.
రీజనల్ టూరిజం హబ్ దుబాయ్ వంటి ఇతర యూఏఈ ఎమిరేట్స్‌లో కాసినోల ఏర్పాటు ఇందులో భాగం అనే వాదనను ఆర్థిక వేత్తలు వినిపిస్తున్నారు. అయితే, గ్యాంబ్లింగ్ కోసం కాకుండా గేమింగ్ కోసం రిసార్ట్ లైసెన్స్ పొందినట్లు వైన్ జనవరిలో ప్రకటించడం గమనార్హం. ఈ కాసినో రస్ అల్ ఖైమా తీరంలో మానవ నిర్మిత ద్వీపంలో 2026లో పూర్తి అవుతుందని బిల్లింగ్స్ తెలిపారు. దుబాయ్‌లో సీజర్స్ ప్యాలెస్ ప్రస్తుతం క్యాసినో లేకుండా రిసార్ట్‌ను మాత్రమే నిర్మిస్తున్నారు. దీన్ని ఎంజీఎం రిసార్ట్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!