నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు...
- November 11, 2022
టీడీపీ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది.వచ్చే ఏడాది జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది.చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
కనీసం ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ రూట్మ్యాప్ సిద్ధం చేశారు.యువత ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా లోకేష్ పాదయాత్ర చేస్తారు. రాష్ట్రంలో రైతాంగం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు లేవనెత్తి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేవిధంగా పాదయాత్ర ప్రణాళిక రూపొందించింది టీడీపీ.ఈ పాదయాత్రలో యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు.ఈ యాత్ర కోసం పార్టీలోని యువనేతలు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు.
దాదాపు ఏడాదిపాటు పాదయాత్ర కొనసాగుతుంది. అయితే, ముందస్తు ఎన్నికలు వస్తే మాత్రం ఈ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







