విశాఖపట్నంకు చేరుకున్న ప్రధాని మోడీ

- November 11, 2022 , by Maagulf
విశాఖపట్నంకు చేరుకున్న ప్రధాని మోడీ

విశాఖపట్నం: ప్రధాని మోడీ విశాఖకు చేరుకున్నారు.ఈ నెల 12 న ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మోడీ విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.ప్రధాని మోడీకి గవర్నర్, ఏపీ సీఎం జగన్ ఘన స్వాగతం పలికారు. విశాఖలోని మారుతి జంక్షన్ లో ప్రధాని మోడీ ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో కోసం బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.ఈ రాత్రి పవన్ కంటే ముందే ఏపీ బీజేపీ నేతలు ప్రధాని మోడీని కలవనున్నారు.రాత్రి 8.30 గంటలకు పవన్.. మోడీతో సమావేశం అవుతారు.

విశాఖలో రేపు మోడీ పాల్గొనే బహిరంగ సభలో ఎనిమిది మందికే అనుమతించారు. ప్రధానితో పాటు వేదికపై గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్, బీజేపీ ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, పీవీఎన్ మాధవ్ మాత్రమే ఉంటారు.ఈ సభలో ప్రధాని మోదీ 40 నిమిషాల పాటు, ఏపీ సీఎం జగన్ 7 నిమిషాల పాటు ప్రసంగిస్తారు.ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com