సంక్రాంతి తర్వాత మీడియా భవన్ నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్
- November 12, 2022
హైదరాబాద్: సంక్రాంతి తర్వాత మీడియా భవన్ నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన మీడియా ఇన్ తెలంగాణ సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు మీడియా యాజమాన్యాలు సహకరించకపోయినా మీడియా ప్రతినిధులు సహకారం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మీడియా మిత్రులకు సముచిత స్థానం కల్పించారని తెలిపారు. జర్నలిస్ట్ లు తెలంగాణ కోసం ఢిల్లీ లో పోరాడారు. వారిని మరువలేవమని.. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. సంక్రాంతి తర్వాత మీడియా భవన్ నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి పై ప్రజలకు మీడియా ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. పేదల కోసం పనిచేసే ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది సోషల్ మీడియా కాదని..యాంటీ సోషల్ మీడియానా అనే భావన కల్గుతుందన్నారు.
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో వెనక్కి వెళ్తుందని.. కోవిడ్ సమయంలో పేదలను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉద్దీపన ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని మంత్రి నిర్మలా సీతారామన్ ని అడిగారా? అని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే మీడియా పై దాడులు చేయడం సరికాదన్నారు. ఏది న్యూసో, ఏది వ్యూసో తెలుసుకోవడానికి అనేకసార్లు పేపర్లు చదవాల్సి వస్తుందన్నారు. ఐదు కేటగిరీల వాళ్లనే జనం చదువుతున్నారని పత్రికలు కూడా వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నాయని వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. 19 వేల అక్రిడేషన్ కార్డులున్న జర్నలిస్టులు రాష్ట్రంలో ఉన్నారన్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







