జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై కేసు నమోదు
- November 12, 2022
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసారు.ప్రస్తుతం ఏపీ లో జనసేన vs వైస్సార్సీపీ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో జగన్ ను గద్దె దింపేందుకు జనసేన కంకణం కట్టుకుంది. ఎప్పటికప్పుడు వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ..ప్రజల్లోకి వెళ్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఫై పోలీసులు కేసు నమోదు చేసారు.
రీసెంట్ గా ఇప్పటం లో ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇల్లు కూల్చేసిన సంగతి తెలిసిందే. అయితే జనసేన సభ కు ఇప్పటం గ్రామస్థులు స్థలాలు ఇచ్చారని కోపం తోనే వారి ఇల్లు కూల్చారని జనసేన ఆరోపించింది. ఇల్లు కోల్పోయిన వారిని పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం కు వెళ్లడం జరిగింది.
పవన్‌ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇప్పటం వెళ్లిన సమయంలో పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు పవన్. తనను ఆపే ప్రయత్నం చేయడంతో.. పార్టీ కార్యాలయం నుంచి కాలి నడకన ఇప్పటం వెళ్లే ప్రయత్నం చేశారు. ఆపై కారుపైకి ఎక్కి ప్రయాణించారు. కారు వేగంగా దూసుకుపోతున్నా కూడా ఆయన కాళ్లు బారజాపుకుని అలానే కూర్చిండిపోయారు. ఇలా టాప్ పైకి ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణించడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, హైవేపై పలు వాహనాలు పవన్ కాన్వాయ్‌ను అనుసరించడం వంటి కారణాలు చూపిస్తూ శివకుమార్ అనే వ్యక్తి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.దీంతో ఐపీసీ 336, రెడ్ విత్ 177MV కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







