షార్జాలో అభిమానులను అలరించిన షారూఖ్
- November 12, 2022
యూఏఈ: ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శన అయిన షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో భారతీయ సినిమా స్టార్ షారుఖ్ ఖాన్ సందడి చేశారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు వేలాది మంది అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా షార్జా బుక్ అథారిటీ (SBA) చైర్మన్ అహ్మద్ అల్ అమేరి.. షారూఖ్ ఖాన్‌కు మొట్టమొదటి బుక్ ఫెయిర్ గ్లోబల్ ఐకాన్ ఆఫ్ సినిమా అండ్ కల్చరల్ నేరేటివ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా షారూఖ్ మాట్లాడుతూ.. సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు, SIBF డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని.. యాసిడ్ దాడి బాధితులకు, ధైర్యాన్ని ప్రదర్శించిన మహిళలందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. జీవితంలో నిజాయితీగా ఉండాలని యువకులకు సూచించారు. యూఏఈలోని బహుళసాంస్కృతికత అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. షారూఖ్ నటించిన "పఠాన్" సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







