యూఏఈలో ఎమిరేటైజేషన్: 50 రోజుల్లోగా లక్ష్యం చేరని సంస్థలకు జరిమానా

- November 12, 2022 , by Maagulf
యూఏఈలో ఎమిరేటైజేషన్: 50 రోజుల్లోగా లక్ష్యం చేరని సంస్థలకు జరిమానా

యూఏఈ: 50 రోజుల్లోగా ఎమిరేటైజేషన్ లక్ష్యాన్ని చేరుకోని ప్రైవేట్ కంపెనీలకు జరిమానాలు విధించనున్నట్లు మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) హెచ్చరించింది. 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు తమ ఎమిరేటైజేషన్ రేటును మొత్తం నైపుణ్యం కలిగిన ఉద్యోగాలలో 2 శాతం పెంచాలని స్పష్టం చేసింది. 2023 జనవరి 1 నుండి లక్ష్యాన్ని పూర్తి చేయడంలో విఫలమైన కంపెనీలకు ఉద్యోగం లేని ప్రతి ఎమిరాటీకి Dh72,000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. అలాగే లక్ష్యాన్ని చేరుకున్న కంపెనీలకు ఎమిరాటీ టాలెంట్ కాంపిటీటివ్‌నెస్ కౌన్సిల్ (నఫీస్) కింద ప్రోత్సాహకాలు, ఇతర మద్దతు ప్యాకేజీలు అందించబడతాయన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com