ముంబై విమానాశ్రయంలో షారుఖ్‌కు చేదు అనుభవం..
- November 12, 2022
ముంబై: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురయ్యింది.ఇటీవల షారుఖ్ కొడుకు డ్రగ్స్ వివాదంలో ఇరుక్కోవడంతో తీవ్ర విమర్శల పాలైన షారుఖ్, ఇప్పుడిప్పుడే ఆ వివాదం నుండి బయటపడుతున్నారు.ఇక ఆయన ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెడుతుండగా, పఠాన్ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో షారుఖ్ సంతోషం వ్యక్తం చేశాడు.
అయితే తాజాగా, ఇప్పుడు షారుఖ్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయనకు ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. షారుఖ్ తన టీమ్‌తో కలిసి దుబాయ్ నుంచి ముంబై శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు విమానంలో చేరుకున్నారు. అయితే ఆయన బ్యాగేజ్‌తో పాటు తన టీమ్ సభ్యుల బ్యాగేజీలో ఆరు అత్యంత ఖరీదైన చేతి వాచ్‌లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన కస్టమ్స్ ఫీజు కట్టేంతవరకు వాటిని తీసుకునేందుకు అనుమతించమని వారు తెలిపారు. అయితే షారుఖ్‌ను ఓ పక్కన కూర్చోబెట్టి, ఆయన టీమ్ సభ్యులు ఈ వాచ్లకు సంబంధించిన కస్టమ్ ఫీజును చెల్లించేందుకు వెళ్లారు.
కానీ అర్ధరాత్రి వేళ కావడంతో, కస్టమ్స్ ఫీజు కౌంటర్ మూసివేశారు. దీంతో ఎయిర్ పోర్టుకు చెందిన రెండో టెర్మినల్‌కు షారుఖ్ టీమ్ సభ్యుడు రవిశంకర్ సింగ్‌ను తీసుకెళ్లి ఆయనచేత కస్టమ్ ఫీజును కట్టించుకున్నారు. షారుఖ్ అండ్ టీమ్ వద్ద ఉన్న వాచ్‌ల విలువ సుమారు రూ.17.86 లక్షలు అని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అయితే అవన్నీ కూడా రవిశంకర్ సింగ్ పేరుతో ఉండటంతో, షారుఖ్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులను పంపించేసి, శనివారం ఉదయం ఫీజు కట్టించుకున్న తరువాత రవిశంకర్ సింగ్‌ను కూడా ఎయిర్ పోర్టు అధికారులు పంపించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి