ట్రాలీపై విమానం.. ఏపీలో ఇరుక్కుపోయిన వైనం!
- November 13, 2022
బాపట్ల: హైదరాబాద్‌కు తరలిస్తోండగా బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది.దానిని తీసేందుకు సిబ్బంది నానా తంటాలు పడగా.. స్థానికులు మాత్రం ఇలాంటి దృశ్యం మరోసారి ఆవిష్కృతం కాదంటూ ఫొటోలను సెల్ ఫోన్లలో బంధించారు. కొందరు వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఘటన బాపట్ల జిల్లా అద్దంకి ప్రాంతంలో చోటు చేసుకుంది. తెల్లవారు జామున ట్రాలీ లారీ పై వస్తున్న విమానం అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది.
హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్‌గా గుర్తింపు పొందిన పిస్తా హౌస్ ఓ పాత విమానాన్ని కొనుగోలు చేసింది. పాత విమానాన్ని హోటల్‌గా మార్చాలనే వినూత్న ఆలోచనలో దీనిని కొనుగోలు చేసింది. కొచ్చిన్‌లో పాత విమానాన్ని కొనుగోలు చేసి అక్కడే హోటల్‌గా మార్పులు చేసింది. అనంతరం రెక్కలను విడదీసి ట్రాలీ లారీలో విమానాన్ని కొచ్చిన్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తోండగా బాపట్ల జిల్లా మేదరమెట్ల బైపాస్‌లోని అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది.
ట్రాలీ లారీ బ్రిడ్జి కింద నిలిచిపోవటంతో ఆ రోడ్డులో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. తర్వాత పోలీసులు వేరే మార్గానికి వాహనదారులను దారి మళ్లించారు. అనంతరం విమానాన్ని జాగ్రత్తగా అండర్ పాస్ బ్రిడ్జి దాటించే ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







