ముంబై-మస్కట్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీస్..

- November 13, 2022 , by Maagulf
ముంబై-మస్కట్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీస్..

ముంబై: భారత్‌కు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్ తాజాగా కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 12 నుంచి ముంబై, మస్కట్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీస్ నడపనున్నట్లు ప్రకటించింది. అది కూడా డైలీ విమాన సర్వీసులు నడిపిస్తామని తెలిపింది. ఈ సర్వీసుల కోసం ఏ320నీయో విమానాన్ని నడపనున్నట్లు చెప్పింది.ఇందులో ఓ ప్రత్యేకత కూడా ఉందని పేర్కొంది. ఈ రూట్‌లో ఇప్పటివరకు ఏ ఎయిర్‌లైన్‌లో లేనివిధంగా ఇందులో ప్రీమియం ఎకానమీ క్లాస్ ఉంటుందని, దీనికి అదనంగా బిజినెస్, ఎకానమీ క్లాస్ ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇక ఈ విమాన సర్వీసులకు సంబంధించిన టికెట్ బుకింగ్స్‌ను విస్తారా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఎయిర్‌లైన్ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా విస్తారా ముఖ్య కార్యనిర్వహణాధికారి వినోద్ కణ్ణన్ మాట్లాడుతూ.. “ఈ రీజియన్‌లో నాల్గో నగరంగా మస్కట్‌ను చేర్చడం ద్వారా మధ్యప్రాచ్యంలో మా ఉనికిని విస్తరించడానికి మేము సంతోషిస్తున్నాము. ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, అభివృద్ధి చెందుతున్న వాణిజ్య, పెట్టుబడి సంబంధాల దృష్ట్యా ఈ కొత్త మార్గం భారత్, ఒమన్ మధ్య పెరుగుతున్న ట్రాఫిక్‌కు మరింత సహాయం చేస్తుంది. మస్కట్‌కు ఇండియా నుండి భారీ సంఖ్యలో ప్రవాసులు, వ్యాపారులు, ఇతర ప్రయాణీకులు వెళ్తుంటారు. ఇక విస్తారా భారతదేశంలోని అత్యుత్తమ విమానయాన సంస్థలో ఒకటి. మా ఎయిర్‌లైన్ బిజినెస్, ప్రీమియం ఎకానమీ క్లాస్ ద్వారా ప్రయాణికులను మరింత ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాం” అని చెప్పుకొచ్చారు.

విమాన సర్వీసు వివరాలు...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com