యూఏఈ ఎయిర్‌లైన్ చౌకైన ఆఫర్
- November 13, 2022
యూఏఈ: Dh1 విమాన టిక్కెట్ల ఆఫర్ ను యూఏఈ బడ్జెట్ ఎయిర్‌లైన్ అయిన విజ్ ఎయిర్ అబుధాబి ప్రకటించింది. శీతాకాలం, పర్యాటక సీజన్ కోసం సరికొత్త ఆఫర్లను విజ్ ఎయిర్ అబుధాబి మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బెర్లూయిస్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ఇంధన-సమర్థవంతమైన ఎయిర్‌క్రాఫ్ట్ A321 నియోను సరికొత్త ఇంజన్ టెక్నాలజీతో నడుపుతున్నామని, దాంతో 20 శాతం ఇంధనం డబ్బులు ఆదా అవుతున్నాయన్నారు. అదేవిధంగా ప్రయాణీకుల ఖర్చును తగ్గించడానికి.. ప్రతి విమానంలో ప్రయాణీకుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యల ద్వారా తమ కస్టమర్లకు తక్కువ ధరకే ఎయిర్‌లైన్ సౌకర్యాలను అందిస్తున్నామన్నారు. అలెగ్జాండ్రియా (ఈజిప్ట్), అల్మాటీ (కజకిస్తాన్), అమ్మన్ (జోర్డాన్), అంకారా (టర్కీ), అకాబా (జోర్డాన్), ఏథెన్స్ (గ్రీస్), బాకు (అజర్బైజాన్), బెల్గ్రేడ్ (సెర్బియా), దమ్మామ్ (సౌదీ అరేబియా), కువైట్ సిటీ (కువైట్), కుటైసి (జార్జియా), మనామా (బహ్రెయిన్), మలే (మాల్దీవులు), మస్కట్ (ఒమన్), నూర్ సుల్తాన్ (కజకిస్తాన్), సలాలా (ఒమన్), శాంటోరిని (గ్రీస్), సరజెవో (బోస్నియా), సోహాగ్ (ఈజిప్ట్), తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్), టెల్-అవివ్ (ఇజ్రాయెల్), టిరానా (అల్బేనియా), యెరెవాన్ (అర్మేనియా) లతోపాటు తదితర ఎంపిక చేసిన రూట్లలో సగటు ధర Dh179లో గమ్యస్థానాలకు చేరుకోవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







