బహ్రెయిన్ లో ‘స్టడీ ఇన్ ఇండియా’: హాజరైన 16 ప్రసిద్ధ భారత విశ్వవిద్యాలయాలు
- November 13, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని ఇండియన్ క్లబ్లో టీఐఈఎస్ (TIES) ఇండియాతో పాటు యూనిగ్రాడ్(UniGrad) ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వహించిన ‘స్టడీ ఇన్ ఇండియా కౌన్సెలింగ్ మీట్ 2022' ముగిసింది. ఇందులో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), బిట్స్ పిలానీ, SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో సహా భారతదేశంలోని 16 ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. ఈ ‘స్టడీ ఇన్ ఇండియా’ సమావేశాన్ని నవంబర్ 11న బహ్రెయిన్‌లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రారంభించారు. ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేసిన తర్వాత భారతదేశంలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల నుండి నాణ్యమైన విద్యనభ్యసించేందుకు చూస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థుల నుండి అధిక స్పందన వచ్చింది. ఈ సమావేశంలో పాల్గొన్న విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ విభాగం అధిపతులు ఇంజనీరింగ్, మెడికల్, హెల్త్‌కేర్, మేనేజ్మెంట్, కామర్స్, లిబరల్ ఆర్ట్స్ కోర్సుల గురించి వివరించారు. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, అవి అందిస్తున్న కోర్సులు తదితర సమాచారం పొందడానికి.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 32332746 లేదా 17344972లో సంప్రదించవచ్చని యూనిగ్రాడ్(UniGrad) వెల్లడించింది.
తాజా వార్తలు
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..







