ముంబై విమానాశ్రయంలో 61 కేజీల బంగారం పట్టివేత..
- November 13, 2022
ముంబై: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 61 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.బంగారం అక్రమంగా తరలిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. ఆదివారం ముంబై, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఈ బంగారాన్ని అధికారులు సొంతం చేసుకున్నారు.
దీని విలువ దాదాపు రూ.32 కోట్లు ఉంటుందని అంచనా.ముంబై విమానాశ్రయం చరిత్రలో ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడూ ఇంత బంగారం ఒకే రోజు దొరకలేదు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..టాంజానియా నుంచి నలుగురు భారతీయులు ఇండియా తిరిగి వచ్చారు. వాళ్లను అధికారులు తనిఖీ చేయగా ఈ బంగారం విషయం బయటపడింది. వీళ్లు ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన బెల్టు ధరించి వచ్చారు. వాటిని పూర్తిగా శరీరానికి చుట్టుకుని తీసుకొచ్చారు.వాటి లోపల చిన్న పాకెట్లలో బంగారం ఉంది.ఇలా మొత్తం ఈ నలుగురు ప్యాసింజర్ల నుంచి మొత్తం 53 కేజీల బరువున్న, రూ.28 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ బంగారం యూఏఈలో తయారైనట్లు అధికారులు గుర్తించారు.
వీరిని అదుపులోకి తీసుకుని, 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. సౌదీకి చెందిన కొందరు వ్యక్తులు వారికి ఈ బెల్టులను దోహాలో అందించినట్లు చెప్పారు. మరో ఘటనలో దుబాయ్ నుంచి వస్తున్న ముగ్గురు ప్రయాణికుల నుంచి 8 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.88 కోట్లు ఉంటుందని అంచనా.ఈ ముగ్గురు ప్రయాణికుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరిలో ఒక మహిళ వయసు 60 ఏళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







