యూఏఈలో నవంబర్ 20న అంతర్జాతీయ హోమియోపతి కాన్ఫరెన్స్
- November 14, 2022
యూఏఈ: రెమీడియం 4.0 ఐహెచ్ఎంఏ (IHMA) నాల్గవ అంతర్జాతీయ హోమియోపతి కాన్ఫరెన్స్‌ను యూఏఈలో నిర్వహించనుంది. నవంబర్ 20న దుబాయ్ లోని స్విస్సోటెల్ అల్ మురూజ్ లో ఈ అంతర్జాతీయ హోమియోపతి కాన్ఫరెన్స్ జరగనుంది. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కోల్‌కతాకు చెందిన ప్రఖ్యాత హోమియోపతి ప్రాక్టీషనర్లు డాక్టర్ సప్తర్షి బెనర్జీ, కేరళలోని కోజికోడ్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ మన్సూర్ అలీలు కాన్ఫరెన్స్‌లో ప్రధాన వక్తలుగా పాల్గొని డెర్మటాలజీలో హోమియోపతి పరిధిని విశ్లేషిస్తారు. అలాగే యూఏఈ, ఇండియాలకు చెందిన దాదాపు 250 మంది హోమియోపతి వైద్యులు ఈ సదస్సులో పాల్గొంటారని ఐహెచ్ఎంఏ యూఏఈ అధ్యక్షుడు, కాన్ఫరెన్స్ ఛైర్మన్ డాక్టర్ ఆల్ఫోన్స్ డిసౌజా తెలిపారు. 2002 ఫిబ్రవరిలో యూఏఈలో హోమియోపతిని చట్టబద్ధం చేశారు. అబుధాబిలో మొదటి హోమియోపతి విభాగాన్ని ఏర్పాటు చేశారు.
హోమియోపతి అనేది "సిమిలియా సిమిలిబస్ కురాంటూర్" లేదా "లైక్స్ క్యూర్ లైక్స్" సూత్రం ఆధారంగా ప్రత్యామ్నాయ ఔషధం జర్మన్ సిస్టమ్. ఇది భారతదేశంలోని ఆయుష్ వ్యవస్థలో ప్రత్యామ్నాయ, సాంప్రదాయ వైద్య వ్యవస్థలలో ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. హోమియోపతి అనేది రెండవ అతిపెద్ద వైద్య విధానం. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఆమోదించిన ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నది.

తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







