దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
- November 15, 2022
యూఏఈ: దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్‌లో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారుల కథనం ప్రకారం.. రాత్రి 7.28 గంటలకు మాల్ ముఖద్వారంలో చెలరేగిన మంటలను సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆపరేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆరు నిమిషాల వ్యవధిలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. రాత్రి 7.42 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అనంతర చేపట్టిన శీతలీకరణ కార్యకలాపాలు రాత్రి 8.09 గంటల వరకు కొనసాగాయి. ఆ తర్వాత మాల్ ని మూసివేయించి.. తదుపరి చేపట్టాల్సిన రక్షణ చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!







