రియాద్ విమానాశ్రయంలో రెండు అంతర్జాతీయ ప్యాసింజర్ టెర్మినల్స్ ప్రారంభం
- November 15, 2022
రియాద్: కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అంతర్జాతీయ ప్యాసింజర్ టెర్మినల్స్ నెం. 3, 4 లను రియాద్ ఎమిర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ ప్రారంభించారు. రియాద్ విమానాశ్రయంలో మొత్తం ఐదు టెర్మినల్స్ ఉన్నాయి. ఇక్కడ టెర్మినల్స్ 1, 2 అంతర్జాతీయ సేవలను అందిస్తుండగా.. టెర్మినల్ 5 దేశీయ విమానయాన సర్వీసులకు కేటాయించారు. టెర్మినల్ 3 గతంలో దేశీయ విమానాల కోసం ఉపయోగించగా.. 1983లో విమానాశ్రయం ప్రారంభించినప్పటి నుండి టెర్మినల్ 4 నిర్వహణలో లేదు. తాజాగా వీటి పునర్నిర్మాణం, విస్తరణ తర్వాత వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో రవాణా, లాజిస్టిక్స్ మంత్రి, జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ఇంజినీర్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ సలేహ్ అల్-జాసర్, GACA అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అల్-దుయిలేజ్ పాల్గొన్నారు. ప్రిన్స్ ఫైసల్ అధునాతన సాంకేతికతో విస్తరించిన టెర్మినల్స్, ఏర్పాటు చేసిన సౌకర్యాలను సందర్శించారు. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ.. కొత్తగా విస్తరించిన రెండు టెర్మినల్స్ రవడం అంతర్జాతీయ ప్రయాణానికి తోడ్పడుతుందని, ముఖ్యంగా ఫిఫా ప్రపంచ కప్ అభిమానులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. గ్లోబల్ హబ్‌గా రియాద్ మారిందని, పర్యాటక రంగం ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికి దోహదపడుతుందన్నారు. కింగ్డమ్ విజన్ 2030 ప్రకారం.. రవాణా, లాజిస్టిక్స్ సేవల కోసం జాతీయ వ్యూహం లక్ష్యాలుగా ఉన్నాయని సలేహ్ అల్-జాసర్ అన్నారు.
తాజా వార్తలు
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్







