బహ్రెయిన్ లో ఎన్నికలు విజయవంతం: పౌరులకు ప్రిన్స్ సల్మాన్ ధన్యవాదాలు
- November 15, 2022
బహ్రెయిన్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన గుదైబియా ప్యాలెస్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. బహ్రెయిన్ ఆరవ పార్లమెంటరీ, మునిసిపల్ ఎన్నికలలో 73% కంటే ఎక్కువ మంది అర్హులైన ఓటర్లు పాల్గొని విజయం సాధించినందుకు కేబినెట్.. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను అభినందించింది. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలోని బహ్రెయిన్ బలమైన ప్రజాస్వామ్యం, సమగ్ర అభివృద్ధికి నిదర్శనం అయిన మరో విజయవంతమైన ఎన్నికల్లో పాల్గొన్నందుకు బహ్రెయిన్ పౌరులకు కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా 2022 పార్లమెంటరీ, మున్సిపల్ ఎన్నికల కోసం పనిచేసిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు, దేవాదాయ శాఖ, ఎన్నికల సాధారణ పర్యవేక్షణ సుప్రీం కమిటీ, సహాయక సబ్‌కమిటీలు, సంబంధిత పార్టీలు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలు, స్వచ్ఛంద బృందాల కృషిని కేబినెట్ ప్రశంసించింది.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







