నవంబర్ 24 నుండి జొమాటో ఫుడ్ ఆర్డర్ సర్వీసులు బంద్
- November 15, 2022
యూఏఈ: నవంబర్ 24 నుండి యూఏఈలో జొమాటో తన ఫుడ్ ఆర్డర్ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇకపై జొమాటో యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్‌లు తలాబత్ యాప్‌ని ఉపయోగించాలని జొమాటో తెలిపింది. జొమాటో రెస్టారెంట్ డిస్కవరీ, డైనింగ్ ఔట్ బిజినెస్‌ను నిర్మించడం కొనసాగిస్తుందని తమ భాగస్వామ్య రెస్టారెంట్‌లకు పంపిన ఇమెయిల్‌లో జొమాటో ఈమేరకు స్పష్టం చేసింది. డిసెంబర్ 30లోపు రెస్టారెంట్ల బిల్లులను క్లియర్ చేస్తామని ప్రకటించింది. జొమాటో కస్టమర్లు తలాబాత్ యాప్‌లో వారి ఇష్టపడే రెస్టారెంట్‌ల నుండి ఆర్డర్ చేయడం కొనసాగించవచ్చని, అలాగే రెస్టారెంట్ భాగస్వాములు కూడా తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి తలాబాత్‌లో చేరాలని సూచించింది. 'వైబ్ చెక్', 'జొమాటో పే' అనే కొత్త ఫీచర్‌లను తమ కస్టమర్ల కోసం త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. వైబ్ చెక్ ఇప్పటికే కొన్ని భారతీయ నగరాల్లో అమల్లో ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు







