ప్రభుత్వ లాంఛనాలతో రేపు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు
- November 15, 2022
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ 79 ఏళ్ల వయసులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు సూచనలు చేశారు. అంత్యక్రియలు ఎల్లుండి జరుగుతాయని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశంపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
కాసేపటి క్రితమే కృష్ణ పార్థివదేహాన్ని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నానక్ రామ్ గూడలోని ఇంటికి తరలించారు. సాయంత్రం 5 గంటలకు భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియంకు తరలిస్తారు. ప్రజల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







