ఒమన్ గవర్నరేట్లలో 800కు పైగా ఉద్యోగ అవకాశాలు
- November 16, 2022
మస్కట్: సుల్తానేట్‌లోని వివిధ గవర్నరేట్లలో ఇటీవల ప్రారంభించబడిన ప్రాజెక్టులలో 800 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీలోని ఎకనామిక్ డైవర్సిఫికేషన్ ఇన్వెస్ట్మెంట్స్ సీనియర్ డైరెక్టర్ తలాల్ బిన్ ఇస్సా అల్ హర్రాసీ షబీబా తెలిపారు. ప్రాజెక్ట్‌లు, చిన్న - మధ్యతరహా సంస్థలకు సాధికారత కల్పించడంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రారంభించబడిన సహాయక ప్రాజెక్ట్‌ల స్థాపనను ప్రోత్సహిస్తున్నామన్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. సోహర్, సలాలా, దుక్మ్, ఇబ్రి, అల్ జబల్ అల్ అఖ్దర్, మస్కట్ గవర్నరేట్‌తో సహా అనేక ప్రాంతాలలో ఉద్యోగాలు ఉన్నాయని షబీబా తెలిపారు. ఇంధనం, పబ్లిక్ సర్వీసెస్, టూరిజం డెవలప్మెంట్, ఇండస్ట్రీ, లాజిస్టిక్స్, ఫుడ్ సెక్యూరిటీ, మైనింగ్ రంగాలలో ఉద్యోగార్థులకు మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







