బంగారం పేరిట భారీ మోసం.. ఇద్దరు ఆఫ్రికన్లకు జైలుశిక్ష, జరిమానా
- November 16, 2022
దుబాయ్: బంగారం పేరిట మోసం చేసిన కేసులో ఇద్దరు ఆఫ్రికన్లకు దుబాయ్ మిస్డిమీనర్స్, ఉల్లంఘనల కోర్టు మూడు నెలల జైలు శిక్ష, $200,000 (Dh734,620) జరిమానా విధించింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత వారిని బహిష్కరించాలని ఆదేశించింది. అప్పీల్ కోర్టు తీర్పును సమర్థించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. యూఏఈకి చేందిన ఓ పౌరుడిని ఇద్దరు ఆఫ్రికన్లు బంగారం ఉందని సంప్రదించారు. తమ దగ్గర $1,320,000 (Dh4,848,492) విలువైన 33 కిలోల బంగారం ఉందని సదరు వ్యక్తిని నమ్మించారు. గత మేలో జరిగిన ఒప్పందం ప్రకారం.. యూఏఈ పౌరుడి దగ్గర్నుంచి అడ్వాన్సుగా $ 100,000 తీసుకొని బంగారం అప్పగించకుండా తాత్సారం చేశారు. అనంతరం మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీరాలోని ఒక హోటల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







