చర్చిల అభివృద్ధికి రూ. 175 కోట్లను కేటాయించిన ఏపీ ప్రభుత్వం
- November 18, 2022
అమరావతి: ఏపి ప్రభుత్వం రాష్ట్రంలో చర్చిల అభివృద్ధికి భారీ నిధులను కేటాయించింది. రూ. 175 కోట్లతో చర్చిల నిర్మాణం, చర్చిల మరమ్మతులు, ఇతర పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున అందించనుంది. జిల్లా కేంద్రాలకు మరో కోటి చొప్పున అదనంగా మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. క్రైస్తవుల శ్మశానాల ఆధునికీకరణకు కూడా ఈ నిధులను వెచ్చించాలని అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఈ నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానంలో ప్రభుత్వం అందించనుంది. ఈ నెల 19వ తేదీలోగా ప్రతిపాదనలను అందించాలని జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులను జారీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్‌లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్‌లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







