యూఏఈలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
- November 20, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని చమురు కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదంలో చెలరేగిన మంటలను సకాలంలో ఆర్పివేయబడినట్లు సివిల్ డిఫెన్స్ తెలిపింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. సైట్ నుండి దట్టమైన పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది సమాచారం అందించారని, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను వ్యాపించకుండా అడ్డుకున్నారని సివిల్ డిఫెన్స్ పేర్కొంది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. గత సంవత్సరం అల్ జజీరా అల్ హమ్రాలోని చమురు కర్మాగారంలో ఇలాగే అగ్నిప్రమాదం సంభవించింది. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







