2023లో ప్రభుత్వ సెలవులు: నాలుగు లాంగ్ వీకెండ్లు!
- November 20, 2022
యూఏఈ: అధికారికంగా 2022లో వచ్చే చివరి అధికారిక సెలవుదినాన్ని యూఏఈ ప్రకటించింది. జాతీయ, స్మారక దినోత్సవాల కోసం డిసెంబర్ 1-3 వరకు సెలవులను యూఏఈ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే 2023లో వచ్చే సెలవులపై దృష్టి సారిస్తే.. నాలుగు లాంగ్ వీకెండ్లు వచ్చే అవకాశం ఉన్నది. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా వచ్చే ఏడాదిలో తొలి హాలిడే రానుంది.
ఈద్ అల్ – ఫితర్
ఈద్ అల్ – ఫితర్ ను పురస్కరించుకొని నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. హిజ్రీ క్యాలెండర్ ప్రకారం.. రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు ఉంటాయని అంచనా. పవిత్ర రంజాన్ మాసం 2023 మార్చి 23న ప్రారంభమై 29 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు శుక్రవారం (ఏప్రిల్ 21) వచ్చే అవకాశం ఉన్నది. ఈ సెలవులు ఏప్రిల్ 23 (ఆదివారం) ముగిసే అవకాశం ఉంది. ఇస్లామిక్ క్యాలెండర్‌లోని తేదీల ప్రకారం.. ధుల్ హిజ్జా 9 నుండి 12 వరకు ఉంటాయి. ఎమిరేట్స్ ఆస్ట్రానమీ సొసైటీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఇబ్రహీం అల్ జర్వాన్ ప్రకారం.. జూన్ 27న( మంగళవారం ) అరాఫా దినం అవ్వనుంది. ఈద్ అల్ అదా మరుసటి రోజు జూన్ 28న (బుధవారం) వస్తుంది. అంటే జూన్ 27 నుండి జూన్ 30 వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది. ఇది నిజమైతే శనివారం-ఆదివారం సెలవు ఉన్న వారికి ఆరు రోజుల వీకెండ్ అవుతుంది.
హిజ్రీ నూతన సంవత్సరం (ఇస్లామిక్ నూతన సంవత్సరం)
మొహర్రం 1 హిజ్రీ ఇస్లామిక్ క్యాలెండర్ మొదటి రోజు. గ్రెగోరియన్ క్యాలెండర్‌లో రోజు సెలవు తేదీకి దగ్గరగా ప్రకటించబడుతుంది.
ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజు
ప్రవక్త ముహమ్మద్ (స) పుట్టినరోజు రబీ అల్ అవ్వల్ 12వ తేదీన జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్ మూడవ నెల. గ్రెగోరియన్ క్యాలెండర్‌లో రోజు సెలవు తేదీకి దగ్గరగా ప్రకటించబడుతుంది.
స్మారక, జాతీయ దినోత్సవాలు
యూఏఈ సంస్మరణ, జాతీయ దినోత్సవాలను డిసెంబర్ 1 నుండి 3 వరకు సెలవులు ఉంటాయి. 2023లో ఇది మూడు రోజుల వీకెండ్ (శుక్రవారం నుండి ఆదివారం) కానుంది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..