టాలీవుడ్ లో మరో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత
- November 20, 2022
హైదరాబాద్: చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ మరణం నుండి ఇంకా సినీ ప్రముఖులు , ప్రేక్షకులు బయటపడకముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆయన అర్ధరాత్రి (ఆదివారం) 01.41 గంటల సమయంలో కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ అయన ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయారు. ఈయన స్వస్థలం మదనపల్లి. రాజేంద్రప్రసాద్ నటించిన ఆ నలుగురు సినిమాకు మదన్ రచయితగా పనిచేశారు. ‘పెళ్లయిన కొత్తలో’ సినిమాతో దర్శకుడిగా మారిన మదన్.. ఆ తర్వాత గుండె ఝల్లు మంది, ప్రవరాఖ్యుడు..గరం, గాయత్రి సినిమాలకు దర్శకత్వం వహించారు. మదన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు